వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా మేకలు, పొట్టేళ్లు నరికి వాటి రక్తంతో వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేయటం వివాదాస్పదమవుతోంది. హోం మంత్రి.. వైఎస్ జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు. బహిరంగ స్థలాల్లో జంతుబలి నేరమన్న హోం మంత్రి అనిత.. ఇలాంటి చర్యలతో ఉన్మాదుల తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

