ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అధికార పక్షంపై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్న కేంద్రం..”అమ్మేది లేదంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ గౌతమ్ అదానీ చేతిలో పెడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని, అమ్మబోమని, ఆదుకుంటామని బీజేపీ చెప్పేవన్నీ ఉత్తి కబుర్లు మాత్రమే. “విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే కుట్ర మోదీదైతే, దాన్ని అమలు చేస్తున్నది సీఎం చంద్రబాబు. ఒక చేత్తో సాయం అని చెప్పి.. మరో చేత్తో లాక్కుంటున్నారు.

