
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది తన కోడలు, ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు, ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ ఈ వీడియోలో చూపించారు.