
పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజలు మనవాళ్లే అని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో POKను స్వాధీనం చేసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీఓకేలో నివసిస్తున్న మన సోదరుల పరిస్థితి ధైర్య యోధుడు మహారాణా ప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ లాంటిదని, ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రాజ్‌నాథ్‌సింగ్ పునరుద్ఘాటించారు.