ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంతో సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ల దాడితో రిఫైనరీ వద్ద భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు స్తంభించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

