
ఐదేళ్లుగా ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు డీఎస్సీ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు. అడ్మిషన్ల పేరుతో సంబంధిత సూళ్ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తుండడంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, అధ్యాపకులుగా పని చేస్తున్న కొందరు అభ్యర్థులు మాత్రం అడ్మిషన్ల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. నెల రోజులు ఇంటి వద్ద ఉండి చదువుకోవాలని అనుకుంటున్న తమకు కుదరడం లేదని ప్రైవేట్ టీచర్లు ఆవేదన చెందుతున్నారు.