
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ‘పాఠశాల’ పేరుతో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల 2025 – 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. పిల్లల నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా డిజిటల్ రైటింగ్ బోర్డులు బహుమతిగా అందజేశారు.