అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్న్యూస్. దశాబ్దాల పోరాటానికి త్వరలో న్యాయం జరగనుంది. కడుపుకట్టుకుని కూడబెట్టుకున్న సొమ్ము.. మళ్లీ తిరిగి ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది.

