ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (IPL) కి బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే, 2026 ఐపీఎల్ సీజన్ ప్రసారాలు బంగ్లాదేశ్‌లో నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్యపరమైన విభేదాలు క్రికెట్ మైదానానికి పాకడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

