మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అక్రమ మద్యం కారణంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని సామాన్యుల జీవితాలు చితికిపోతుంటే, మరోవైపు జగన్ అనుచరులు మాత్రం వేల కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. పక్కా ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బయటపెట్టిందని కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

