అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన ఈ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో దాదాపు అరగంటపాటు గడిపారు. 11.40గంటలకు కోర్టుకు వచ్చిన జగన్ 12.15గంటలకు బయటకు వెళ్లిపోయారు.

