భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేశాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వడోదరలో జరిగిన భారత్- న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు చేయడంతో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 28 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.. విరాట్ కోహ్లీ, సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌లు తక్కువ సమయంలోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుని నెంబర్ వన్ అయ్యాడు.

