అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు. ఐఎస్‌ఎస్‌లో ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ఇటీవల నాసా (NASA) ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా నలుగురు ఆస్ట్రోనాట్‌లతో కూడిన క్రూ-11 డ్రాగన్ వాహకనౌక ఎండీవర్ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అయితే గోప్యతా కారణాలు, ప్రొటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు.

