
అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో హెయిర్‌కట్ చేయించుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. భూమికి దూరంగా గురుత్వాకర్షణ లేని వాతావరణంలో జుట్టు కత్తిరించడం అనేది ఒక సంక్లిష్టమైన పని. కత్తిరించిన వెంట్రుకలు తేలియాడి.. అంతరిక్ష కేంద్రంలోని సున్నితమైన పరికరాలలో, ప్రాణ వాయువు వ్యవస్థలలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి వ్యోమగాములు ప్రత్యేకమైన వాక్యూమ్ క్లిప్పర్‌లను ఉపయోగిస్తారు. ఇవి జుట్టును కత్తిరించిన వెంటనే వాటిని లోపలికి పీల్చుకుంటాయి.ఎంతో జాగ్రత్తగా నికోల్ అయర్స్ ముగ్గురు వ్యోమగాములకు హెయిర్ కట్ చేశారు.