
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. భారత్‌లో అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ ఆమెను వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్‌ఐ హ్యాండ్లర్ల్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం.