తెలంగాణలో ఇప్పటి వరకు పని చేస్తున్న అంగన్‌వాడి హెల్పర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లో కూడా పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టి అక్షరాలు నేర్పించే అంగన్వాడి హెల్పర్లకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అధికారిక ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మందికిపైగా అంగన్వాడీ హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.

