
భారత మహిళా క్రికెట్ జట్టు మరో సారి సామాజిక చైతన్యానికి నాంది పలికే వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం లో శనివారం జరగబోయే ఆస్ట్రేలియాతో చివరి వన్డే లో టీమిండియా మహిళల జట్టు పింక్ కలర్
జెర్సీతో క్రీడాభిమానుల ముందుకు రాబోతోంది. ఈ ప్రత్యేక జెర్సీ వెనుక ఉన్న కారణం మాత్రం క్రికెట్ కంటే పెద్దది – రొమ్ము క్యాన్సర్ అవగాహన. రొమ్ము క్యాన్సర్ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.