
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ధన్ ధాన్య యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను
అభివృద్ది చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ని అమలు చేయనున్నారు.