తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి లభించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్భవన్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

