
పాకిస్థాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి నిబంధనల ప్రకారం భారత్లోకి ప్రవేశించకుండా, పాకిస్తాన్ నుంచి నెపాల్ మీదుగా భారత్కు వచ్చాడు. హైదరాబాద్కు చేరి, అక్కడి యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడు తన విదేశీ పౌరసత్వాన్ని అధికారులకు తెలపకుండా ఇదంతా చేయడం నేరంగా మారింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, గత చరిత్ర, ప్రయాణ వివరాలు, వలస నిబంధనలు, పెళ్లి చట్టబద్ధత గురించి విచారిస్తున్నట్లు సమాచారం.