
హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదివారం.. మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకూకట్పల్లిలో ఒక వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా.. భారీ ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి వారు తమ కాన్వాయ్‌ను వదిలిపెట్టి.. ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్‌బీ వరకు మెట్రోలో ప్రయాణించారు. దీనివల్ల వారు సమయానికి గమ్యస్థానానికి చేరుకోగలిగారు.