
హైదరాబాద్ నగరంలో మరో కొత్త దందా ఊపందుకుంది. నగరంలో పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు సోదరులు ‘ఎస్ఐడీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు ఖాతాదారులుగా ఉన్న 13 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించగా.. ట్రాన్సాక్షన్ల ఆధారంగా 400 మందికి పైగా వినియోగదారులను గుర్తించే పనిలో పడ్డారు.