నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు.

