బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నంత పనిచేశారు. ముందే చెప్పినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. రైతు సంక్షేమంపై రేవంత్ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చించేందుకు ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ సీఎంకు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

