సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ‘మన శంకరవరప్రసాద్’, ‘రాజా సాబ్’ చిత్రాల ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారు ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ అప్పీల్ చేశారు. సింగిల్ జడ్డి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, టికెట్ ధర పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని తమ అప్పీల్‌ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరారు. నిర్మాతల అప్పీల్‌పై బుధవారం హైకోర్టు విచారించనుంది.

