హెచ్‌ఐవీ కేసుల నియంత్రణలో AP దేశంలోనే టాప్ లో నిలిచినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) నిర్దేశించిన 80% లక్ష్యంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) ఏకంగా 76.96% సాధించిందని ఆయన తెలిపారు. 2015-16లో 2.34%గా ఉన్న పాజిటివిటీ రేటు, 2024-25 నాటికి 0.58% కు తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. 2024-25 నాటికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య 88.72% మేర తగ్గినట్లు మంత్రి తెలిపారు.

