మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై వస్తున్న వార్తల నడుమ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు చెబుతున్నట్లు ఇది ఎదురుకాల్పుల్లో జరిగిన మరణం కాదని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన స్పష్టం చేశారు. కూనంనేని ఆరోపణల ప్రకారం, పోలీసులు హిడ్మాను ముందే అదుపులోకి తీసుకున్నారని, ఆపై అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపరంగా శిక్షించాలే తప్ప, పోలీసులే న్యాయమూర్తులుగా మారి తీర్పులు ఇవ్వకూడదని కూనంనేని హితవు పలికారు.

