ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందుజా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. లండన్‌లోని ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. హిందుజా సోదరులలో అగ్రజుడైన గోపీచంద్ చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన వారు. 2023 మేలో తన సోదరుడు శ్రీచంద్ మరణాంతరం గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్‌కు భార్య సునీత, కుమారుడు సంజయ్, ధీరజ్‌లు ఉన్నారు.

