బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్‌లో ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌ను ఆహ్వానించారు. ‘ద ఇండియా వి ఇమాజిన్’ అనే థీమ్‌తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల కాన్ఫరెన్స్‌లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

