హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే జలసంధిని మూసివేశామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చన్నారు. అయితే భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావడంలేదని చెప్పారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణిస్తున్నాయని ఇరాన్ మంత్రి తెలిపారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకు ఎటువంటి సమస్యా లేదని తెలిపారు.

