
బెంగళూరులో జరిగిన 60 రోజుల స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా పూణేకు చెందిన యూపీఎస్సీ ఐపీఎస్ అభ్యర్థి పూజా మాధవ్ వావల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి రాత్రి సగటున తొమ్మిది గంటలు నిద్రపోయిన 14 మంది ఫైనలిస్టులను
అధిగమించి అగ్రస్థానాన్ని అధిరోహించింది. దీంతో రూ. 9.1 లక్షల నగదు బహుమతితోపాటు ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కూడా గెలుచుకుంది. స్లీప్ ఇంటర్న్‌షిప్ దేశంలో పెరుగుతున్న నిద్ర లేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.