జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ అయ్యేందుకు ఏకంగా బాండ్ పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడు. తనను ఎన్నుకుంటే ఏకంగా గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం 22హామీలతో బాండ్ రెడి చేసి.. ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రతి ఏడాది 5 చొప్పున పూర్తిగా 22 హామీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నాడు సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు. లేని యెడల తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించుటకు సల్కాపురం గ్రామస్థులకు పూర్తి అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.

