ఆమె హాజరీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో విచారణ ఆరంభించారు. హసీనా ఇతరులపై అమానుషకాండ కేసు దాఖలు అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసిటి)
ఈ ప్రక్రియను హసీనా హాజరీతో నిమిత్తం లేకుండా చేపట్టింది. ఆమె తమ పదవీకాలంలో విద్యార్థుల నిరసనలపై దమననీతితో వ్యవహరించారని, అమానుష నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు వెలువడ్డాయి. ఆమెకు పలుసార్లు సమన్లు ఆమె పేరిట పంపించారు.

