చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్‌లేయర్స్, నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడడంతో అవి ధ్వంసమయ్యాయి. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుడు సృష్టించడానికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా ప్రచురించింది.

