దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాసై వెస్ట్ ప్రాంతంలో మంగళవారంనాడు క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. సుమారు 10 నుంచి 12 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. బాధితులు శ్వాస సమస్యలు, కళ్లు మంటలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లోరిన్ గ్యాస్ లీక్ సమాచారంతో అగ్నిమాక సిబ్బంద ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

