
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది. 2024లో మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్లు అంటే సుమారు రూ. 37,600 కోట్లకు చేరింది. 2021 తర్వాత అత్యధికం అని రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరం భారతీయుల డబ్బు సుమారు రూ. 30,500 కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది. అయితే ఆ తర్వాత ఒక్క సారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. 2023లో 70 శాతం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది.