కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్ లు కన్పిస్తున్నాయి. అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. చాలా మంది పిల్లలు సఫగేషతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అవస్థలకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

