
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్ని నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియలన్నింటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కోడ్ అమలుతో పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.