ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దుష్ప్రవర్తన నుంచి తమిళనాడు విముక్తి కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 23, 2026) తమిళనాడు ప్రభుత్వంపై దాడి చేశారు. DMK అనేక వాగ్దానాలు చేసింది కానీ ఫలితాలు శూన్యం అని అన్నారు. ఆయన DMK ప్రభుత్వాన్ని CMC అని పిలిచారు . అంటే కరప్షన్ మాఫియా క్రైమ్‌ను ప్రోత్సహించే ప్రభుత్వం అని అర్థమని వివరించారు. తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

