
తమిళనాడులోని మదురైలో జరిగిన ‘మురుగన్ మానాడు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గంభీరంగా స్పందించారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానాడును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం తగదు. మా మతాన్ని మీరెవరు ప్రశ్నించేది? అంటూ డీఎంకే నేతలపై కౌంటర్ వేశారు. హిందువు హిందువుగా ఉండకూడదా? ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా? అని ధ్వజమెత్తారు.