సౌదీలో కఫాలా వ్యవస్థను 1950లో ప్రారంభించారు. దీని గురించే తెలిసే కార్మికులు అక్కడికి వెళతారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదా కఫాలా వ్యవస్థదారుల చేతిలోనే ఉంటుంది. సౌదీలో పని చేసేవారు అక్కడికి వెళ్ళగానే తమ పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించాల్సి ఉంటుంది. కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్ళాలన్నా యజమాని అనుమతి ఇవ్వాల్సిందే ఇప్పటికే దీన్ని ఇజ్రాయెల్, బహ్రెయిన్ లు రద్దు చేశాయి. కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్లో వివిధ రూపాల్లో ఇంకా కొనసాగుతోంది.

