బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దక్షిణాది దర్శకులు సినిమాలపై ఓ రేంజిలో పొగడ్తల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాలు అద్భుతంగా రూపొందుతున్నాయంటూ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్, సౌత్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయ సినిమాలను ప్రాంతాలుగా విడదీయడం సరికాదు. భారతదేశం విశాలమైన దేశం. దేశవ్యాప్తంగా పలు భాషలు ఉన్నాయి. తెలుగు, మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలలో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు ఉన్నారు. ఇటీవల ‘జవాన్’, ‘RRR’, ‘బాహుబలి’ లాంటి భారీ హిట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గమనించారు. సినిమా పరంగా, టెక్నికల్ గా కూడా సౌత్ ఇండియన్ సినిమాలు చాలా బాగున్నాయి.