డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (AI) సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కి మాత్రమే ఉన్న ‘కంటెంట్ బ్లాకింగ్’ అధికారాలను ఇప్పుడు ఇతర కీలక శాఖలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,విదేశీ వ్యవహారాల,రక్షణ,సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు నేరుగా కంటెంట్ తొలగించే అధికారం ఇవ్వనున్నారు.ఈ మార్పుల వల్ల విమర్శలు లేదా సెటైరికల్ పోస్టులు తొలగించే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

