
తనపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విజయ్ షా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను సుప్రీం కోర్టు మందలించింది. మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వంలో విజయ్ షా గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలను మే 14న మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని ఆదేశించింది.