
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. “గత కొన్ని రోజులుగా దేశం చూపిన సహనం, సామర్థ్యం అంతా మేము చూశాం. సైన్యం, మిలటరీ, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, శాస్త్రవేత్తలందరికి నమస్కరిస్తున్నాను” అని ఆయన తెలిపారు. భారత త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేశారు. దేశం మొత్తం సైనికులకు మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు.