సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారే దిశగా పయనిస్తోందని , కోయంబత్తూర్ సభలో ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. తాను రాగానే రైతులు తమ చేతి కండువాను గాల్లోకి ఊపారని, తాను రావడానికి ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చిందనిపించిందని వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియా నేచరల్ ఫార్మింగ్ సమిట్ 2025ను ప్రధాని మోడీ ఇక్కడ ప్రారంభించారు. దేశం మొత్తం మీద తొమ్మిది కోట్ల రైతులకు మద్దతుగా పిఎం కిసాన్ పథకం 21వ వాయిదా కింద రూ.18,000 కోట్లను ప్రధాని మోడీ విడుదల చేశారు.

