జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో కోనేరు హంపి జోరు కొనసాగిస్తోంది. కఠినమైన ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్ సెమీ ఫైనల్‌కు చేరువైంది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్లో ఆమె చైనా ప్లేయర్ యుక్జిన్ సాంగ్‌ను ఓడించింది. తర్వాతి గేమ్‌ను డ్రా చేసుకున్నా చాలు హంపి సెమీస్ చేరడం ఖాయం. అయితే.. మహిళా బృందం మాత్రం నిరాశపరిచింది. ద్రోణవల్లి హారిక, దివ్యా దేశ్‌ముఖ్‌లు డ్రాతో సరిపెట్టుకున్నారు.

