
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మంచి జోష్‌లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వరుసగా రెండో రోజు సరికొత్త రికార్డులకు చేరాయి. సెప్టెంబర్ 17న ఇండియా-యూఎస్ ట్రేడ్ టాక్స్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు మళ్లీ షేర్ల కొనుగోళ్లలో మునిగిపోయారు. ఈ ఉత్సాహంలో నిఫ్టీ మొదటిసారి జూలై 11 తర్వాత 25,300 మార్క్‌ని అధిగమించింది. ఇప్పుడు అందరి దృష్టి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రిజల్ట్‌పై ఉంది.