
ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ఇదొక వరల్డ్ రికార్డ్. దీనిని శనివారం ప్రకటిస్తారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు.