
రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.